icon icon

FREE SHIPPING above Rs.350!*

Author
Nobel Hygiene

అప్పుడప్పుడు మీరు రోజుకి ఇరువై సార్ల వరకు మూత్ర విసర్జన చేస్తునట్టు అనిపిస్తుంది, అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా కొన్ని సార్లు మూత్ర విసర్జన చెయ్యాలి అనిపిస్తుంది! కానీ, ఇలా అపుడప్పుడు కాకుండా తరుచుగా జరుగుతున్నట్లయితే, అలా ఎందుకు జరుగుతుందో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

ఒక రోజులో ఎనిమిది సార్లు కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యకరమైన విషయం కాదని మీకు తెలుసా? అలా ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది అంటే అది మీ ఆరోగ్య పరిస్థితి గురించి మీకు కొన్ని సూచనలు ఇస్తుంది అని అర్ధం. “అస్సలు, మూత్రం అన్ని సార్లు ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యపోతున్నారా?” మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారు. ప్రతి పావు గంట కి ఒకసారి బాత్రూం కి ఎందుకు పరిగెత్తాల్సి వస్తుందో కారణాలు తెలుసుకుందాం రండి.

తరచు మూత్ర విసర్జన వెనుక కారణాలు: మూత్రం ఎక్కువ రావడానికి గల 9 కారణాలు మూత్రం ఎక్కువ సార్లు వస్తే ఏం చేయాలి (Causes of Frequent Urination: 9 Reasons for Peeing So Often)

1. నీరు అధికంగా త్రాగడం (Too much Water)

“నాకు తరుచుగా మూత్రం ఎందుకు వస్తుంది?” ఎందుకంటే మీరు ఎక్కువ నీరు తాగుతున్నారు కాబట్టి! అంతే! ఎక్కువ నీరు త్రాగితే ఎక్కవ మూత్రం వస్తుందని మీకు ప్రక్కాగా తెలుసు. కానీ, మీరు దృష్టి సారించని విషయం ఏంటంటే; మనం తీసుకునే ఆహారం లో కుడా నీటి శాతం ఉంటుంది. మొన్న అన్నం తిన్నాక పుచ్చకాయ తిన్నారుగా? హా, అందులో చాలా నీరు ఉంటుంది. ఈ సరళమైన నియమాన్ని అనుసరించండి : మీరు మీ మూత్రం పారదర్శకంగా లేదా లేత పసుపు రంగులో ఉండేంత నీరు త్రాగితే చాలు. అంతే కానీ, ముఖ్యమైన పనులని వదిలేసి బాత్రూమ్కు పరుగెత్తేంత నీరు త్రాగాల్సిన అవసరం లేదు.

2. యూటిఐ (UTI)

నీరు త్రాగిన తరువాత మీకు తరుచుగా మూత్రం ఎక్కువ వస్తుంది అంటే, మీకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ సంక్రమించి ఉండొచ్చు. యూటిఐ మీ మూత్రపిండాలను, మూత్రాశయాన్ని, మూత్రనాళాలని మరియు మూత్రనాళంతో సహా మూత్ర మార్గాల అవయవాలను చికాకుపరుస్తుంది. మీ మూత్రాశయం ఎప్పటిలాగా ఎక్కువ మూత్రాన్ని నిల్వచేయలేకపోతుంది. అందుకే, ఏ కొంచెం ద్రవ పదార్ధం తీసుకున్నా మీరు బాత్రూం కి పరిగెత్తాల్సి వస్తుంది. ఈ యూటిఐ ఉండటం వల్ల మీకు కలుషితమైన మూత్రం, రక్తపు మూత్రం, ఒక వింత వాసన వచ్చే మూత్రం లేదా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి రావడం లాంటివి జరుగుతాయి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

3. మధుమేహం (Diabetes)

ఎక్కువగా మూత్రం రావడం అనేది మధుమేహం యొక్క మొదటి సంకేతాలలో ఒకటి. మధుమేహం మీ రక్తం లోని చక్కెర స్థాయిలను పెంచుతుంది; కిడ్నీలు (మూత్రపిండాలు) వాటిని ఫిల్టర్ చెయ్యాలని చూస్తాయి కానీ విఫలమవుతాయి. ఈ ఫిల్టర్ చేయని చక్కెర మీ మూత్రంలో చేరుతుంది. ఇది మీ శరీరం లోని నీటిని ఎక్కువగా లాగేసుకుంటుంది ఫలితంగా మీకు ఎక్కువగా మూత్ర విసర్జన చెయ్యాలి అనిపిస్తుంది.

4. డైయురెటిక్స్ (మూత్రవర్థకాలు(Diuretics)

అధిక రక్తపోటును నియంత్రించడానికి అలాగే కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలకు చికిత్స చేయడానికి మూత్రవిసర్జన మందులను తరచుగా ఉపయోగిస్తారు. వీటిని నీటి ఔషధాలు అని కూడా అంటారు. అవి మీ మూత్రంలో ఎక్కువ ఉప్పు లేదా సోడియం విడుదల చేసేలా మిమ్మల్ని ప్రేరేపిస్తాయి, తద్వారా మీకు తరుచుగా మూత్రం వస్తుంది.

5. మూత్రాశయ నొప్పి సిండ్రోం (Painful Bladder Syndrome)

మూత్రాశయ నొప్పి సిండ్రోం వల్ల మీకు మూత్ర విసర్జన చేయడం లేదా సెక్స్ చేయడం నిజంగా కష్టతరం అవుతుంది. మీకు తరుచుగా మూత్రవిసర్జన చెయ్యాలి అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఏమీ రాదు. దీనికి ఖచ్చితమైన కారణం అంటూ ఇంకా కనుగొనబడలేదు. కానీ, మీ మూత్రాశయం ఉబ్బినప్పుడు మరియు దాని సున్నితత్వం పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది.

ఇలాంటప్పుడు మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

6. కిడ్నీలో రాళ్ళు (Kidney Stones)

కిడ్నీలో రాళ్ళ వల్ల వికారం, జ్వరం, వణుకు మరియు నడుము పక్కల అలాగే వెనుకల నొప్పి కలుగుతుంది. అది క్రమంగా చుట్టూ ప్రక్కలకి వ్యాపిస్తుంది. ఒకవేళ ఆ రాళ్ళు చిన్నవి అయితే వాటంతట అవే బయటకి వస్తాయి. లేదంటే వైద్యుడిని సంప్రదించి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది.

7. గర్భం (Pregnancy)

ఒకవేళ మీరు గర్భవతి అయ్యి, ఎందుకని నాకింత తరచుగా మూత్రం వస్తుంది?” అని గనక మీరు ఆలోచిస్తూ ఉంటే, ఇది మీ కోసమే. మీ మూత్రాశయం పైనే మీ గర్భాశయం ఉంటుంది. గర్భిణీ స్త్రీ యొక్క మూత్రాశయం తరచుగా శిశువు నుండి చాలా ఒత్తిడిని కలిగి ఉంటుంది. శిశువు పైనుంచి దాన్ని క్రిందకి నెడుతూ ఉంటాడు. ఇది మూత్రాశయం యొక్క నిల్వ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది, అందువల్ల మీరు మరింత తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

8. వాజినిటిస్ (Vaginitis)

వాజినిటిస్ అనేది ఈస్ట్, బ్యాక్టీరియా, వైరస్‌లు, మందులు లేదా హార్మోన్ల మార్పుల కారణంగా మీరు సంకోచించగల యోని యొక్క ఇన్ఫెక్షన్. దీనివల్ల మీకు సెక్స్ చేస్తున్నప్పుడు లేదా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మీకు బాధ కలుగవచ్చు.మీరు తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికతో పాటు యోని ఉత్సర్గ మరియు వాసనను కూడా గమనించవచ్చు. వెంటనే వైద్యుడిని సందర్శించండి.

9. అతిగా ఆల్కహాల్ లేదా కెఫిన్ తీసుకోవడం (Too Much Alcohol or Caffeine)

కాఫీ మరియు మద్యం మూత్రవిసర్జన మందులుగా పనిచేస్తాయి. అందువల్ల అవి తరచుగా మీ శరీరం నుండి అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని బయటకు పంపుతాయి. మీరు తప్పనిసరిగా ఆల్కహాల్ తాగవలసి వస్తే, దానితో పాటు కొంచెం నీటిని కూడా సేవిస్తూ ఉండండి. కాఫీ యొక్క ప్రభావాలు ఆల్కహాల్ వలె తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ, ఇది కూడా మీ శరీరానికి అదే పని చేస్తుంది. కాబట్టి, మీకు తరచుగా మూత్రం వస్తున్నట్లయితే మీరు కాఫీ మరియు ఆల్కహాల్ ను తీసుకోవడం తగ్గించండి.

మూత్రం లీకేజ్ సమస్య పరిష్కారం: మూత్రం ఎక్కువ సార్లు వస్తే ఏం చేయాలి? (Frequent Urination Treatment: What to do if you pee quite often?)

క్రొత్తగా  సమస్య ఎదుర్కుంటున్న వారు అయితే మీరు ఎంత నీరు తాగుతున్నారో గమనించండి. నీరు తాగిన తరువాత ఎంతసేపటికి మూత్రం వస్తుందినీరు మీ శరీరం లోకి వెంటనే శోషించతుంది. మీరు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉన్నట్లయితేమీరు నీళ్ళు తాగిన పది నిముషాలకే మీకు మూత్రం వస్తుంది. అదే ఒకవేళ మీరు డీహైడ్రేషన్కు గురైనట్లయితే తొమ్మిది నుండి పది గంటల వరకు కూడా మీకు మూత్ర విసర్జన చెయ్యాలి అని అనిపించకపోవచ్చు!

“నాకు మూత్రం రాత్రుళ్ళు ఎక్కువగా ఎందుకు వస్తుంది?” లేదా “నాకు ఉదయాన్నే ఎక్కువ మూత్రం ఎందుకు వస్తుంది?” మీరు పడుకునే ముందు ద్రవాలు తీసుకుంటున్నట్లయితే ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మీ ఎముకలకి పసుపు పాలు మంచివి కావొచ్చు, కానీ, మీకు ఈ మూత్ర సమస్య ఉంటే ఇది దానికి దోహదం చేస్తుంది.

మీకు సహాయపడే కొన్ని సూచనలు;

  • కెగెల్స్వ్యాయామాలు చేయడం
  • మూత్రాశయశిక్షణ
  • కారంగాఉండే ఆహారాన్ని నివారించడం
  • ఆల్కహాల్మరియు కాఫీ ని సేవించడం తగ్గించుకోండి

తరచుగా మూత్రం రావడం అనేది మీ జీవన నాణ్యతకు భంగం కలిగిస్తున్నట్లయిటే, వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి దానికి తగు పరిష్కారాన్ని పొందండి.